Saturday, April 20, 2024
HomeTrending Newsప్రత్యేక సమావేశం పెట్టండి: సిఎంకు ధర్మాన వినతి

ప్రత్యేక సమావేశం పెట్టండి: సిఎంకు ధర్మాన వినతి

Issue to be discussed: శాసనసభ, న్యాయ, కార్య నిర్వాహక వ్యవస్థల పరిధులు, అధికారాలు, బాధ్యతలపై విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని సీనియర్ నేత, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. రాజ్యంగ స్ఫూర్తి కి అనుగుణంగా ఈ మూడు అంగాల మధ్య  అధికారాల విభజనపై చర్చిచేందుకు వెంటనే శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధర్మాన విజ్ఞప్తి చేశారు.

రెండ్రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు అమరావతి రాజధానిపై ఇచ్చిన తీరుపై ధర్మాన స్పందించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాను వ్యాఖ్యానించడం లేదని, కానీ తీర్పు సందర్భంగా రాజధానిపై శాసనం చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ పేర్కొన్న అంశంపై అందరూ ఆలోచించాలని సూచించారు. దీనిపై ధర్మాన ఓ ప్రకటన విడుదల చేశారు.

హైకోర్టు తీర్పు తనను తీవ్రంగా ఆలోచింపజేస్తోందని ధర్మాన అన్నారు. “శాసనాలు తయారు చేయటం, విధివిధానాలు రూపొందించటం, ప్రజా సంక్షేమానికి,భద్రతకు రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి అవసరమైన చట్టాలు రూపొందించటం రాజ్యాంగం ద్వారా  రాష్ట్ర శాసన సభకు సంక్రమించిన హక్కు మరియు బాధ్యత. ఈ హక్కును వినియోగించుకోకపోతే రాష్ట్ర శాసన సభ తన బాధ్యతను విస్మరించినట్టే కదా. ఇటువంటి హక్కును, బాధ్యతను కాదనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని నేను భావిస్తున్నాను” అని ప్రకటనలో పేర్కొన్నారు.

“మన రాజ్యాంగ మౌలిక సూత్రాలలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిపాలనకు సంబంధించి శాసన నిర్మాణం, కార్య నిర్వాహక మరియు న్యాయ వ్యవస్థల పరుధులను స్పష్టముగా నిర్ణయించి నిర్వహించడం జరిగింది. దీనినే ప్రజాస్వామ్య వ్యవస్థలో “Doctrine of Separation of powers” గా పేర్కొంటూ రాజ్యాంగము ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. దీని వల్ల శాసన సభ, కార్య నిర్వాహక వర్గము, న్యాయ వ్యవస్థ వాటి వాటి పరుధులకు లోబడి ఒక దానిని ఒకటి అతిక్రమించకుండా, ఒక దానిలో ఇంకొకటి జోక్యం చేసుకోకుండా ప్రజలకు సుపరిపాలన అందించటం లక్ష్యంగా రాజ్యాంగ నిర్మాతలు  ఒక మహత్తరమైన  లక్ష్యం తో చేసిన ఏర్పాటు ఇది” అని ధర్మాన గుర్తు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్