Thursday, March 19, 2026
Homeస్పోర్ట్స్Womens T20I Tri-Series: ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్ రద్దు

Womens T20I Tri-Series: ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్ రద్దు

ఇండియా-సౌతాఫ్రికా-వెస్టిండీస్ మధ్య జరుగుతోన్న టి 20 ముక్కోణపు సిరీస్ లో భాగంగా నేడు జరగాల్సిన ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. సౌతాఫ్రికా ఈ సిరీస్ కు ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఈస్ట్ లండన్ బఫెలో పార్క్ మైదానంలో జరుగుతోన్న ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు స్మృతి మందానా- జెమీమా రోడ్రిగ్యూస్ లు రెండు ఓవర్లకు 4 పరుగులు చేసిన సమయంలో భారీ వర్షం కురిసింది. మైదానం చిత్తడిగా మారడంతో ఆటను కొనసాగించే పరిస్థితి కనిపించలేదు. అంపైర్లు ఆటను రద్దు చేశారు. సోమవారం జనవరి 30న విండీస్ తో మ్యాచ్ ఆడనుంది.

ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ లలో సౌతాఫ్రికా, విండీస్ లపై గెల్చిన ఇండియా ఇప్పటికే ఫైనల్స్ కు చేరుకుంది. జూన్ 2న సౌతాఫ్రికా- ఇండియా మధ్య తుది పోరు జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular