Thursday, September 19, 2024
HomeTrending NewsWomen’s Reservation:మహిళా బిల్లుపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

Women’s Reservation:మహిళా బిల్లుపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం ఉధృతం చేసింది. ఈ బిల్లుపై చర్చను కోరుతూ లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అఖిలపక్ష సమావేశం నిర్వహించి మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చించాలని ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత ఈ తీర్మానాలు ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం దేశంలోని విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, చర్చలు నిర్వహించేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనపరులు, మేధావులకు ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డులు పంపించారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఇప్పటికే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేసిన ఎమ్మెల్సీ కవిత…అనంతరం దాదాపు 15 పార్టీలు , ఆయా మహిళా సంఘాలతో భారత్ జాగృతి నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

Also Read : మహిళా రిజర్వేషన్ కు విపక్షాల మద్దతు

RELATED ARTICLES

Most Popular

న్యూస్