Friday, April 19, 2024
Homeస్పోర్ట్స్WPL: గుజరాత్ బోణీ – బెంగుళూరుకు హ్యాట్రిక్ ఓటమి

WPL: గుజరాత్ బోణీ – బెంగుళూరుకు హ్యాట్రిక్ ఓటమి

విమెన్ ప్రీమియర్ లీగ్ లో బెంగుళూరు వరుసగా మూడో పరాజయం మూట గట్టుకుంది.  గుజరాత్ జెయింట్స్ 11 పరుగులతో బెంగుళూరుపై విజయం సాధించింది.  ముంబై బ్రబౌర్న్  స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.  ఓపెనర్ సబ్బినేని మేఘన (8)  త్వరగా ఔటైనా సోఫియా డంక్లీ- హర్లీన్ డియోల్ రెండో వికెట్ కు 60 పరుగులు జోడించారు. డంక్లీ 28 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 65; హర్లీన్ డియోల్ 45 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్ తో 67 పరుగులతో రాణించారు. గార్డ్ నర్-19; హేమలత-16, సుదర్లాండ్-14 రన్స్ చేశారు. నిర్ణీత 20  ఓవర్లలో  7 వికెట్లకు  201 పరుగులు చేసింది.

బెంగుళూరు బౌలర్లలో శ్రేయంకా పాటిల్, హైదర్ నైట్ చెరో 2; మేగాన్ స్కాట్, రేణుకా సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.

లక్ష్యం భారీగా ఉండడంతో బెంగుళూరు ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. జట్టు స్కోరు 54వద్ద కెప్టెన్ స్మృతి మందానా (18) ఔటైంది.  సోఫీ డివైన్ 45బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 66; ఎలిస్ పెర్రీ 25బంతుల్లో  5 ఫోర్లతో 32 పరుగులతో రాణించారు. చివర్లో  హిదర్ నైట్ 11 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్ తో 30; శ్రేయాంకా పాటిల్ నాలుగు బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ తో 11 రన్స్ తో ఇద్దరూ నాటౌట్ గా నిలిచినా ప్రయోజనం లేకుండా పోయింది. 20 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 6 వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేయగలిగింది.

గుజరాత్ బౌలర్లలో ఆష్లీ గార్డ్ నర్ 3; సుదర్లాండ్ 2, మన్షి జోషి 1 వికెట్ పడగొట్టారు.

సోఫియా డంక్లీ కి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్