Sunday, February 23, 2025
Homeస్పోర్ట్స్ఇంగ్లాండ్ టూర్ కి సిద్ధమవుతున్న సాహా

ఇంగ్లాండ్ టూర్ కి సిద్ధమవుతున్న సాహా

భారత వికెట్ కీపర్- బ్యాట్స్ మ్యాన్ వృద్ధిమాన్ సాహా కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఢిల్లీలో 15 రోజుల క్వారంటైన్ తరువాత సొంతూరు కోల్ కతా చేరుకున్నారు. ఆగస్ట్ లో ఇంగ్లాండ్ టూర్ కు సాహా ఎంపికైన సంగతి తెలిసిందే.

ఐపిఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ తరఫున ఆడుతున్న సాహా కోవిడ్ బారిన పడ్డారు. అయితే సీజన్ ను బిసిసిఐ నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లోని ఓ హోటల్ లో క్వారంటైన్ లో వున్నారు సాహా.

ఇంగ్లాండ్ కు బయల్దేరే భారత జట్టు ముంబైలో కఠిన నిబంధనలతో కూడిన క్వారంటైన్ లో గడపనుంది. వృద్ధిమాన్ సాహా మరోసారి ఆర్ టి పి సి ఆర్ టెస్టు చేయించుకుని బయో బబుల్ లో జట్టుతో చేరనున్నాడు.

నాలుగురోజుల క్రితం సాహా రెండు సార్లు కోవిడ్ టెస్టులు చేయించుకుంటే పరస్పర విరుద్ధ ఫలితాలు వచ్చాయి, మరోసారి జరిపిన టెస్టులో నెగెటివ్ గా రావడంతో ఇసోలేషన్ ముగించుకుని కోల్ కతా బయల్దేరి వెళ్ళాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్