Wednesday, April 17, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ప్రభుత్వ లెక్కలు అంకెల గారడీ : యనమల

ప్రభుత్వ లెక్కలు అంకెల గారడీ : యనమల

ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ఉద్యోగాల కంటే తీసేసిన ఉద్యోగాలు 10 రెట్లు ఎక్కువగా ఉన్నాయని మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ అంకెల గారడీయేనని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో 2.3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిలో 10 వేల ఉద్యోగాలకు క్యాలెండర్ ఇచ్చి చేతులు దులుపుకుంటారా అని ప్రశ్నించారు. ఆర్టీసీలో పనిచేస్తున్న 50 వేల మందిని విలీనం చేసి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పు లెక్కలు చూపిస్తున్నారని యనమల ఆరోపించారు.

బిసి బ్యాక్ లాగ్ పోస్టులు ఎందుకు జాబితాలో చూపలేదని యనమల ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ¬95 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్ కింద భర్తీ చేసుకున్నట్లు చూపారని, వారు గతంలో పనిచేసిన ఉద్యోగులేనని యనమల వివరించారు. ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని, వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అన్నింటికీ నోటిఫికేషన్ విడుదల చేయాలని యనమల డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్