0.1 C
New York
Thursday, December 7, 2023

Buy now

HomeTrending Newsయశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు

యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాజ్యసభ సెక్రటరీ జనరల్ కార్యాలయంలో సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. యశ్వంత్ సిన్హా వెంట రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఉన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత ప్రఫుల్ పటేల్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఇతర నేతలు పాల్గొన్నారు.

నామినేషన్ దాఖలు చేసిన తర్వాత విజయ్ చౌక్ వద్ద గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. కాగా, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీఆర్ఎస్ తరపున మంత్రి కేటీఆర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. నామినేషన్ దాఖలుకు జూన్ 29 చివరి తేదీ. రాష్ట్రపతి ఎన్నికలు జులై 18న జరగనున్నాయి. జులై 21న ఫలితాలు వెలువడతాయి.

Also Read : విపక్షాల అభ్యర్ధిగా యశ్వంత్‌సిన్హా 

RELATED ARTICLES

Most Popular

న్యూస్