Tuesday, March 19, 2024
HomeTrending Newsఉత్తరంధ్రపై మాట్లాడే హక్కు లేదు: అచ్చెన్న

ఉత్తరంధ్రపై మాట్లాడే హక్కు లేదు: అచ్చెన్న

అమరావతి-అరసవిల్లి మహా పాదయాత్రకు ఉత్తరాంధ్ర ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు. పాదయాత్రను  అడ్డుకునేందుకు అధికార వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిందని, దానికి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులే డుమ్మా కొట్టారని అన్నారు. అమరావతి రాజధానిపై సిఎం జగన్ మాట మార్చుకుని ప్రజల్లో పలచన అయ్యారని, దాన్ని సమర్ధించలేకే నేతలు ఆ మీటింగ్ కు గైర్హాజరు అయ్యారని ఎద్దేవా చేశారు. కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి వార్షికోత్సవాల సందర్బంగా అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న అనంతరం మీడియాతో మట్లాడారు.

పాదయాత్రను ఆడుకోవడం ఐదు నిమిషాల పని అంటూ మంత్రి బొత్స మాట్లాడడాన్ని అచ్చెన్నాయుడు తీవ్రంగా తప్పు బట్టారు. బాధ్యత గల మంత్రులు ఇలా మాట్లాడడం సరికాదని, అయినా రాష్ట్రం మీ జాగీరా అని నిలదీశారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, ఈ ప్రాంతంపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదని స్పష్టం చేశారు. తోటపల్లి, మద్దువలస ప్రాజెక్టులు పూర్తి చేశామని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శంఖుస్థాపన చేశామని, జాతీయ రహదారులు తీసుకు వచ్చామని వివరించారు.  ఈ మూడున్నర సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకు రాకుండా, ఈ ప్రాంతాన్ని నాశనం చేసి ఇప్పుడు మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. ఇన్నేళ్ళుగా అభివృద్ధి చేయకుండా ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం దారుణమన్నారు.

Also Read : ఆర్బీకేలు ఏటిఎంలుగా మారాయి: అచ్చెన్నాయుడు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్