పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవటంతో YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. న్యాయస్థానం ఆదేశాల్ని కూడా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోవటం లేదని షర్మిల మండిపడ్డారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగిన షర్మిల… పాదయాత్ర కు అనుమతి ఇచ్చే వరకు కొనసాగిస్తానన్నారు.  పార్టీ నేతలను బొల్లారం పోలీస్ స్టేషన్ లో మూడు రోజులుగా నిర్భందంలో ఉంచారని ఆరోపించారు. పార్టీ కార్యాలయం ముందు కొనసాగుతున్న వైఎస్ షర్మిల ఆమరణ నిరహార దీక్ష, దీక్ష చేస్తున్న వైఎస్ షర్మిల గారికి వైద్య పరీక్షలు, వైఎస్ షర్మిల మంచి నీళ్ళు కూడా తాగట్లేదని, ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని, మంచి నీళ్ళు తీసుకోక పోవడంతో డీహైడ్రేషన్ అవుతోందని డాక్టర్లు తెలిపారు.

Ys Sharmila Diksha

మరోవైపు షర్మిల నివాసం లోటస్ పాండ్ వద్ద కొనసాగుతున్న పోలీసుల నిర్భంధకాండ. లోటస్ పాండ్ చుట్టూ అష్ట దిగ్బంధనం చేసిన పోలీసులు పార్టీ కార్యకర్తలను లోపలకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. మరోవైపు పార్టీ నేతల అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. నిన్నటి బొల్లారం పోలీస్ స్టేషన్ లోనే 40 మంది పార్టీ ముఖ్య నేతలు ఉండగా బంజారాహిల్స్ పి ఎస్ లో 7 గురు పార్టీ నేతలను ఉంచారు. ఆన్న పానీయాలు సైతం లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో కి రానివ్వాని వైనం నెలకొంది. లోటస్ పాండ్ చుట్టూ ఖర్ఫ్యు వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *