Saturday, June 13, 2026
HomeTrending Newsర‌ణ్‌థంబోర్ టైగ‌ర్ పార్క్‌లో సోనియా రాహుల్

ర‌ణ్‌థంబోర్ టైగ‌ర్ పార్క్‌లో సోనియా రాహుల్

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ 76వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా త‌న కుటుంబంతో క‌లిసి ర‌ణ్‌థంబోర్ టైగ‌ర్ పార్క్‌లో నిరాడంబరంగా వేడుకలు జరుపుకున్నారు. టైగర్ పార్క్ లో స‌ఫారీ చేశారు. కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీల‌తో క‌లిసి ఈ సాహ‌స‌యాత్ర చేశారు. ర‌ణ్‌థంబోర్ టైగ‌ర్ నేష‌న‌ల్ పార్క్‌లోని టైగ‌ర్ స‌ఫారీలో విహ‌రించారు. దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధికి ఇష్టమైన ప్రదేశాల్లో రణథంబోర్ టైగర్ పార్క్ ఒకటి. చాలా రోజుల తర్వాత కుటుంబమంతా కలిసి రణథంబోర్ పార్క్ లో శుక్రవారం సరదాగా గడిపారు.

రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి త‌న త‌ల్లి పుట్టిన‌రోజు వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి రాజ‌స్థాన్ లోని స‌వాయ్ మాధోపూర్ చేరుకున్న సోనియా కుటుంబం, ఓపెన్‌టాప్ జీప్‌లో స‌ఫారీ చేశారు. టైగ‌ర్ పార్క్ మొత్తం ఈ జీప్‌లో క‌లియ తిరిగి సంద‌డి చేశారు. మొన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ బాధ్య‌త‌లు త‌న భుజాన ఉండ‌టంతో పార్టీ ప‌నుల‌తోనే బిజీగా ఉండిపోయారు. పార్టీ అధ్య‌క్షురాలిగా త‌ప్పుకున్నాక జ‌రుపుకుంటున్న పుట్టిన‌రోజు వేడుక‌లు కావ‌డంతో స్పెష‌ల్‌గా జ‌రుపుకోవాల‌ని భావించిన సోనియా కుటుంబం ర‌ణ్‌థంబోర్ టైగ‌ర్ పార్క్‌లో వేడుక‌లు జ‌రుపుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular