Thursday, March 28, 2024
HomeTrending Newsవైఎస్ విజయమ్మ రాజీనామా

వైఎస్ విజయమ్మ రాజీనామా

Resigned: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తన పదవికి రాజీనామా చేశారు. ప్లీనరీ వేదికగా ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. తన కుమారుడు జగన్ ఆంధ్ర ప్రదేశ్ లో, కుమార్తె షర్మిల రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రాజకీయ పార్టీల నేతలుగా కొనసాగుతున్నారని… ఇలాంటి నేపథ్యంలో తాను ఇద్దరు బిడ్డలతో కొనసాగడం భావ్యం కాదనే నిర్ణయానికి వచ్చి తాను వైఎస్సార్సీపీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.

విమర్శలకు తావివ్వకూదడనే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని, ఇక్కడ జగన్ ను మీరంతా ఆశీర్వదించారని.. తల్లిగా తనకు ఇద్దరు బిడ్డలూ సమానమేనని… కానీ అక్కడ షర్మిల ఒంటరి పోరాటం చేస్తున్నారని అందుకే ఆమెకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని, అందుకే తాను ఇక్కడి పార్టీ బాధ్యతలనుంచి తప్పుకుంటున్నట్లు  చెప్పారు.

నేడు మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండ్రోజుల ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత సిఎం జగన్ అధ్యక్షోపన్యాసం చేయగా, ఆ తరువాత  వైఎస్ విజయమ్మ మాట్లాడి ఈ ప్రకటన చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్