Sunday, January 19, 2025
HomeTrending Newsదేశంలో ఎక్కడాలేని నేతన్ననేస్తం: జగన్

దేశంలో ఎక్కడాలేని నేతన్ననేస్తం: జగన్

నేతన్న నేస్తం లాంటి కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయడంలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో మీ బిడ్డగా ఈ పథకం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత మూడేళ్ళుగా ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరికీ ఇప్పటికి 72 వేల రూపాయలు ఇచ్చామని తెలిపారు. ఇదే సొంత మగ్గం ఉండి, ఆ మగ్గమే ఆధారంగా బతుకున్న వారికి ఐదేళ్ల కాలంలో దాదాపుగా రూ.1.20 లక్షలు ఈ ఒక్క పథకం ద్వారానే అందుతాయన్నారు.

వైఎస్సార్‌ నేతన్న నేస్తం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి  జమ చేశారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడిన ప్రసంగాలోని ముఖ్యంశాలు

  • నేతన్న నేస్తం పథకానికి లబ్ధిదారుల ఎంపిక చాలా పారదర్శకంగా జరిగింది.
  • ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వలంటీర్లు ద్వారా కానీ, గ్రామ సచివాలయానికి నేరుగా వెళ్లి కానీ దరఖాస్తు చేసుకోవచ్చు.
  • నిర్ధిష్టమైన కాలపరిమితిలోగా వాళ్ల తనిఖీ పూర్తి చేసి లబ్ధిదారుల జాబితాను సచివాలయంలో సోషల్‌ ఆడిట్‌ కోసం ప్రదర్శిస్తున్నాం.
  • అనర్హులకు రాకూడదు, అర్హత ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్‌ కాకూడదు అని ఆరాటపడే ప్రభుత్వం ఇది.
  • వైయస్సార్‌ నేతన్న నేస్తం ద్వారానే ఇవ్వాళ్టితో కలుపుకుని దాదాపుగా రూ.600 కోట్ల రూపాయలు నేరుగా సహాయం అందించాం.
  • చేనేత సహకార సంఘాలకు, ఆప్కోకు గత ప్రభుత్వం బకాయిపడ్డ రూ.103 కోట్లను కూడా మేము చేల్లిన్చాం
  • ఆప్కో సేకరించిన వస్త్రాలు, పిల్లల యూనిఫారమ్స్‌ కోసం రూ.1600 కోట్ల రూపాయలు నేరుగా నేతన్నలకు మంచి చేసేందుకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
  • గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేనేత రంగం మీద, నేతన్నలకు వాళ్లు ఖర్చు చేసింది కేవలం రూ.259 కోట్లు మాత్రమే.
  • చేనేత రంగంలో నేతన్నల ఇబ్బందులు దూరం చేసేందుకు .. ఆప్కో ద్వారా ఇ– మార్కెటింగ్‌ ఫ్లాట్‌ఫాంను తీసుకు వచ్చాం.
  • దీని ద్వారా ఉత్పత్తులను ప్లిప్‌ కార్ట్,  ఆమెజాన్‌లో అమ్ముకునే వెసులుబాటు కల్పించాం
RELATED ARTICLES

Most Popular

న్యూస్