Saturday, November 23, 2024
HomeTrending Newsదుగ్గిరాల ఎంపీపీ గా సంతోష రూపవాణి

దుగ్గిరాల ఎంపీపీ గా సంతోష రూపవాణి

Duggirala YCP: రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపిపి ఎన్నిక ముగిసింది. మండల ప్రజా పరిషత్ ఛైర్మన్ గా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి సంతోష రూప వాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాం ప్రసన్న కుమార్  ఈ ఎన్నికను అధికారికంగాప్రకటించారు. వైస్ ఎంపీపీ లుగా టిడిపికి చెందిన జబీన్, జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎంపిటిసి సాయి చైతన్య ఎన్నికయ్యారు. కొ ఆప్షన్ సభ్యుడిగా టిడిపి బలపరిచిన వహీదుల్లా ఎన్నికయ్యారు.  ఈ మండలాన్ని కైవసం చేసుకోవడం ద్వారా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు.

దుగ్ఈగిరాల మండలంలో మొత్తం 18 ఎంపిటిసి స్థానాలు ఉండగా టిడిపి 9,  వైఎస్సార్సీపీ 8, జనసేన 1 స్థానంలో విజయం సాధించాయి.  బీసీ మహిళలకు రిజర్వ్ అయిన ఈ స్థానంలో టిడిపి తరఫున గెలిచిన వారిలో బీసీలు ఎవరూ లేరని, ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి  తాము ఈ స్థానాన్ని నిలబెట్టుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే  మొదటినుంచీ ధీమాగా ఉన్నారు. అయితే  తమ  పార్టీ నుంచి  గెలిచిన షేక్ జబీన్ కు బీసీ సర్టిఫికేట్ ఇవ్వకుండా అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆర్కే కుట్రలు చేశారని టిడిపి ఆరోపించింది.

మరోవైపు వైసీపీ తరఫున గెలిచిన బీసీ వర్గానికి చెందిన పద్మావతి అనే ఎంపిటిసిని తమవైపు లాక్కొని గెలిపించాలని టిడిపి ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాను ఎంపీపీ చైర్మన్ పదవి రేసులో ఉన్నానని పద్మావతి కూడా ప్రకటించారు. అయితే నిన్న సాయంత్రం నుంచి పద్మావతి కనిపించకుండా పోవడం సంచలనం కలిగించింది. ఎమ్మెల్యే ఆర్కే తన తల్లిని కిడ్నాప్ చేయించారని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని ఆమె కుమారుడు వెల్లడించాడు. పద్మావతి మినగా మిగిలిన ఎంపిటిసిలతో కలిసి ఆర్కే నేడు ఉదయం ఎంపీపీ ఆఫీసుకు చేరుకున్నారు.

ఎన్నిక ప్రక్రియ మొదలు పెట్టిన తరువాత సంతోష రూపవాణి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆమె ఎన్నిక లాంఛనప్రాయమే అయ్యింది.  రూపవాణి కి ఆర్కే తో పాటు పులువురు నేతలు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్