Wednesday, September 25, 2024
HomeTrending Newsజాబ్ మేళా నిరంతర ప్రక్రియ: విజయసాయి

జాబ్ మేళా నిరంతర ప్రక్రియ: విజయసాయి

Address unemployment: రాష్ట్రంలో ఏ ఒక్కరూ నిరుద్యోగిగా ఉండకూడదన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయం మేరకీ రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత శ్రీవి. విజయసాయి రెడ్డి వెల్లడించారు.  యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే దృక్పధంతో ప్రయివేట్‌ రంగంలో ఉద్యోగాలు కల్పించే దిశగా ఈ జాబ్‌ మేళా ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాబ్‌ మేళా అనేది నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

వైయస్సార్‌ జిల్లా – ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న జాబ్ మేళాలో విజయసాయి పాల్గొన్నారు. – జాబ్‌ మేళాకు విచ్చేసిన వివిధ కంపెనీల నుంచి వచ్చిన ప్రతినిధులు, ఉద్యోగాలను ఆశించి వచ్చిన విద్యార్థినీ, విద్యార్థులకు  సిఎం జగన్ తరఫున అభినందనలు తెలిపారు.  విద్య అనేది ప్రతి ఒక్కరికీ అవసరమని, మనం జీవించడానికి ఆహారం ఎంత అవసరమో విద్య, వైద్యం కూడా అలాంటిదేనని అభిప్రాయపడ్డారు. మనిషి జీవితంలో ఈ మూడింటికి సమోన్నత ప్రాధాన్యత ఉందన్నారు.

ప్రతి ఒక్కరూ ఉన్నత చదువుకోవాలి, ముఖ్యంగా విద్యార్థినులు కూడా గొప్పగా చదువుకుని ఉన్నత పదవులకు వెళ్లాలని, మహిళా సాధికారత వైయస్సార్‌ సీపీ ఆశయం, ముఖ్యమంత్రి కల అని అది తప్పకుండా నెరవేరుతుందని అయన ధీమా వ్యక్తం చేశారు. అందుకే నాడు-నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ఆహ్లాదకర వాతావరణం ఉండేవిధంగా తీర్చిదిద్ది విద్యా ప్రమాణాలు పెంచుకోవడం జరుగుతోందని చెప్పారు.

విద్యార్థినీ, విద్యార్థులు విద్యతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, వాటిని ఇంప్రూవ్‌ చేసుకోవాలని సూచించారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రపంచం అంతా ఒకటేనని, ఎక్కడకు వెళ్లాలన్నా కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ చూస్తారని చెప్పారు. మనసులో ఉన్న ఆలోచనలను ఎదుట వ్యక్తికి ఎంత ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్‌ చేస్తామో.. దాన్నిబట్టే ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశాలు ఉంటాయని హితవు పలికారు.

వైఎస్ఆర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నవారు ఎక్కువగా కనిపిస్తారని, గల్ఫ్ లో ఎలా అయితే ఉపాధి పొందుతున్నారో భవిష్యత్‌లో అమెరికాలో గానీ ఆస్ట్రేలియాలో గానీ జర్మనీ, జపాన్‌, యూరప్‌లో గానీ ఉద్యోగ అవకాశాలు సంపాదించుకునే స్కిల్స్‌ అలవరచుకోవాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్