Sunday, February 23, 2025
HomeTrending Newsవైసీపీకి ఏకపక్షం: మాచర్ల క్లీన్ స్వీప్

వైసీపీకి ఏకపక్షం: మాచర్ల క్లీన్ స్వీప్

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతోంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరించడం, బిజెపి-జనసేన ముందస్తు ప్రణాళికతో కలిసి పోటీ చేయలేకపోవడం లాంటి అంశాలతో  వైసీపీ ఏకపక్షంగా గెలుపు బాటలో సాగుతోంది.

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని మాచర్ల నియోజకవర్గంలో వైయస్ఆర్ సీపీ క్లీన్‌స్వీప్ చేసింది 5 ZPTC స్థానాలకు ఐదూ; 71 MPTC స్థానాలకు 71 వైయస్ఆర్ సీపీ విజయం దక్కించుకుంది.

ప్రకాశం: మార్కాపురం ZPTC వైఎస్ఆర్ సీపీ కైవసం, 15,315 ఓట్ల మెజార్టీతో బాపన్న రెడ్డి;  ప్రకాశం: తుర్లుపాడు జడ్పీటీసీ వైఎస్ఆర్ సీపీ కైవసం. 10,335 ఓట్ల మెజార్టీతోవెన్న ఇందిర;  చిత్తూరు: ఎస్ఆర్ పురం జడ్పీటీసీ వైఎస్ఆర్ సీపీ కైవసం. 13,335 ఓట్ల మెజార్టీతో రమణ ప్రసాద్ రెడ్డి విజయం సాధించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్