Sunday, January 19, 2025
HomeTrending Newsఓ డ్రామాలా సాగింది: సొమిరెడ్డి

ఓ డ్రామాలా సాగింది: సొమిరెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ఓ స్టేజ్ డ్రామా లాగా సాగిందని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభివర్ణించారు. పార్టీ సమావేశంలో కార్యకర్తల అభిప్రాయలు తెలుసుకోకుండా, వారితో మాట్లాడించకుండా కేవలం మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో టిడిపిని, మీడియాను తిట్టించడమే అజెండాగా సాదిందని విమర్శించారు. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివ కుమార్ ఎక్కడా కనబడలేదని, గౌరవాధ్యక్షురాలు సెలవు చీటీ ఇచ్చారని, జగన్ విడిచిన బాణం చెల్లెలు షర్మిల కనీసం మొహం కూడా చూడకుండా తప్పించుకుతిరిగారని, వైఎస్ కు ఆత్మగా చెప్పుకునే కేవీపీ ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారని, వైఎస్ నీడ సూరీడు మాయమై పోయారని విమర్శించారు. ఇక ప్రజలు జగన్ ను ఎలా నమ్మాలని ప్రశ్నించారు.

ఎన్నికల హామీలు 95 శాతం అమలు చేశామని వైసీపీ నేతలు చెబుతున్నారని, సీపీఎస్ రద్దు చేయలేదని, విద్యుత్ ఛార్జీలు తగ్గించలేదని, 9 గంటల విద్యుత్ 7 గంటల పాటే ఇస్తున్నారని… ఇవన్నీ ఆ 95 శాతంలో ఉన్నాయా అని నిలదీశారు. బటన్ నొక్కుతున్నామని చెబుతున్నారని కానీ రివర్స్ బటన్ నొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. పంచాయతీల నుంచి స్థానిక సంస్థలనీ నిర్వీర్యమైపోయాయని దుయ్యబట్టారు. అప్పటివరకూ దేశవ్యాప్తంగా అమలవుతున్న పథకాలన్నీ మూడేళ్ళుగా ఎందుకు నిలిపి వేశారో, డ్రిప్ ఇరిగేషన్ ఎందుకు ఆపేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ, నీటిపారుదల, రోడ్లు, భవనాల శాఖలకు అసలు పనిలేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకు కూడా సిఎం గడప తొక్కే దమ్ము లేకపోయిందన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా డమ్మీలని స్వయంగా మాజీ మంత్రి పేర్ని నాటి ప్లీనరీ సాక్షిగా చెప్పారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వైఎస్సార్ జగన్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మారిందని ధ్వజమెత్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్