Friday, March 29, 2024
HomeTrending NewsYSRCP: 8న బిసి ఆత్మీయ సమ్మేళనం

YSRCP: 8న బిసి ఆత్మీయ సమ్మేళనం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ 8న బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన బిసి మంత్రులు,  పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మూడున్నర సంవత్సరాలో బీసీ వర్గాలకు జరిగిన మేలు తో పాటు, ఆయా కులాలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను తెలియజెప్పెందుకే ఆ సమ్మేళనం నిర్వహిస్తున్నామని, దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వెల్లడించారు.  ఈ సదస్సుకు గ్రామస్థాయిలో ఉన్న సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీ, ఆలయ కమిటీ ఛైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు హాజరవుతారని, దాదాపు పదివేల మంది వరకూ  ఈ మీటింగ్ లో పాల్గొంటారని వివరించారు. బీసీలు ఈ సమాజానికి వెన్నెముక లాంటివారని, తమది బీసీల ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకోగలుగుతామని చెల్లుబోయిన ధీమా వ్యక్తం చేశారు.

అధికారంలోకి రాకముందే బీసీల అభ్యున్నతి కోసం ఓ అధ్యయన కమిటీ ఏర్పాటు చేసి వారికోసం ఎలాంటి పథకాలు అమలు చేయాలో ఆలోచించిన ఘనత సిఎం జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. బీసీ సంక్షేమం కోసం ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకోవడంతో పాటు బీసీలను పార్టీ వైపు మరింత ఆకర్షించేందుకు ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై సదస్సులో చర్చిస్తామని, విజయవాదలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ సభ ఉంటుందని జంగా వివరించారు.

Also Read : బీసీలు ఐక్యంగా ఉండాలి: విజయసాయి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్