Monday, February 24, 2025
HomeTrending Newsబాధ్యతలు స్వీకరించిన జకియా

బాధ్యతలు స్వీకరించిన జకియా

Jakiya Khanum chaired: 
శాసనమండలి డిప్యూటీ చైర్‌ పర్సన్‌గా ఎన్నికైన ఎమ్మెల్సీ శ్రీమతి జకియా ఖానమ్‌ నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమెను అభినందించారు. ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించాగానే సిఎం తో పాటు పలువురు సభ్యులు ఆమెని చైర్మన్ సీటు వద్దకు తోడ్కొని వచ్చారు. అనంతరం ఛైర్మన్ మోషేన్ రాజు తన సీట్లో ఆమెను కూర్చోబెట్టారు. సభ్యులు ఆమెను అబినందించారు.

ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ  “ఈరోజు అధ్యక్షా అని సంభోదించే స్ధానంలో నా అక్క జకియా ఖానమ్‌ అమ్మ కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక సాధారణ కుటుంబం నుంచి ఒక గృహిణిగా చట్టసభల్లో అడుగుపెట్టడమే కాకుండా డిప్యూటీ  చైర్మన్‌గా ఈ రోజు ఆ స్ధానంలో కూర్చున్నారు.

నిజంగా మైనార్టీ అక్కచెల్లెమ్మలందరికీ ఇది ఒక సంకేతం, ఒక సందేశం. మహిళలు అన్ని రకాలుగా పైకి రావాలి… ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలి, ప్రభుత్వమన్నది తోడుగా ఉండాలి అన్న మన ప్రయత్నం ఈ రెండున్నర సంత్సరాలుగా జరుగుతుంది.  అందులో భాగంగా దేవుడు ఈ రోజు నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను. మీకు మంచి జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ శెలవు తీసుకుంటున్నాను” అని ప్రసంగించారు.

Also Read : సిఎంతో జకియా ఖానమ్ భేటి

RELATED ARTICLES

Most Popular

న్యూస్