Friday, June 12, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్రాష్ట్రానికి మరో 5 లక్షల కోవిషీల్డ్ వాక్సిన్లు

రాష్ట్రానికి మరో 5 లక్షల కోవిషీల్డ్ వాక్సిన్లు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మరో 5 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. వెంటనే వాటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. గన్నవరం నుండి వైద్య,ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు టీకా డోసులు సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అనంతపురం – 45 వేలు, చిత్తూరు – 40 వేల, తూర్పు గోదావరి – 40 వేలు, గుంటూరు – 40 వేలు, కృష్ణా – 45 వేలు, కర్నూలు – 40 వేలు, ప్రకాశం – 35 వేలు, నెల్లూరు – 38 వేలు, శ్రీకాకుళం – 30 వేలు, విశాఖపట్టణం – 40 వేలు, విజయనగరం – 30 వేలు, పశ్చిమ గోదావరి – 37 వేలు, కడప – 40 వేలు డోసులు పంపిణీకి ఏర్పాట్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular