ఆంధ్ర ప్రదేశ్ నుంచి వైద్యం కోసం హైదరాబాద్ వస్తున్న అంబులెన్సులను పోలీసులు అనుమతిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఈ వివాదానికి తెర పడింది. నాలుగు రోజులుగా కోవిడ్ చికిత్స కోసం ఏపి నుంచి హైదరాబాద్ వస్తున్న అంబులెన్సులను సరిహద్దుల వద్ద తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. హైదరాబాద్ లోని ఆస్పత్రిలో బెడ్ కన్ఫర్మేషన్ ఉంటేనే వాహనాన్ని అనుమతిస్తున్నారు.
సరిహద్దుల వద్ద అంబులెన్సులు నిలిపి వేయడంతో కర్నూల్ నుంచి హైదరాబాద్ బయల్దేరిన ఇద్దరు రోగులు మృత్యు వాత పడ్డారు. హైకోర్ట్ ఈ విషయమై విచారణ జరిపి అంబులెన్సులు అడ్డుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఈ-పాస్ లేకపోయినా అంబులెన్సులు అనుమతిస్తున్నారు.