Sunday, January 19, 2025
Homeఫీచర్స్అనుమానం మొగుడితో అవమానం

అనుమానం మొగుడితో అవమానం

Family Counselling :

Q. నాకు పెళ్లయి 9 సం. ఇద్దరు మగ పిల్లలు. నా భర్త విదేశంలో మంచి ఉద్యోగంలో ఉన్నారు. నేను నా పిల్లలు, అత్తగారు ఇక్కడే ఉంటాము. అయితే మా వారికి నా మీద విపరీతమైన అనుమానం . ప్రతి నిమిషానికి వీడియో కాల్ చేసి నన్ను ఇబ్బంది పెడతారు. ఫంక్షన్ లో ఉన్నా కూడా వీడియో కాల్ చేస్తుంటారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎక్కడ ఉన్నావు? ఎవరితో ఉన్నావు? అని వేధించడాన్ని నేను భరించలేక పోతున్నాను. బంధువులలో పరువు పోతోంది. ఎన్నో సార్లు పంచాయతీ పెట్టి పెద్దవాళ్లతో చెప్పించినా కూడా మారడం లేదు. ఆయన చిన్నప్పటి నుండి హాస్టల్లో ఉంటూ చదువుకున్నారు. మరి దానివల్లనో ఏంటో. ఈ మధ్య మరీ ఘోరంగా తయారయ్యారు. బస్ లో నా వంక ఎవరు చూసినా కూడా అతనికి నీకు సంబంధం ఏంటి అని అడుగుతున్నారు. ఇంక ఇతను మారడా? జీవితంలో సుఖం లేకుండా పోతోంది. నా సమస్యకు పరిష్కారం ఉందా?
-ఎస్. ఎస్

A. తొమ్మిదేళ్లుగా నరకం చూస్తూ కూడా మారతాడనే ఆశతో కాపురం చేస్తున్న మీకే బాగా తెలియాలి అతను మారతాడో లేదో. హాస్టల్ లో చదువుకుంటే ఇలా ఉంటారని చెప్పలేం. అయితే అప్పట్లో అతనిపై ప్రభావం చూపిన సంఘటన ఏదన్నా జరిగిందేమో. దానివల్ల ఇటువంటి అభద్రతా భావం మొలకెత్తిందేమో వివరంగా అడిగి తెలుసుకోవాలి. అటువంటిది ఏమైనా ఉంటే సైకియాట్రిస్ట్ ను కలిస్తే మంచిది. పంచాయతీలతో, సిఫార్సులతో కాపురాలు నిలబడవు. సమస్య ఎక్కడుందో తెలుసుకుని పరిష్కారం చూడాలి. అస్తమానూ వీడియో కాల్ చేసి విసిగిస్తున్నాడంటే అభద్రతాభావం పెద్ద వృక్షమై కూర్చుందన్నమాట. ఇటువంటి స్వభావం మాటలతో, సలహాలతో కన్నా చికిత్స, కౌన్సిలింగ్ తోనే మారే అవకాశం ఉంది. కుటుంబజీవితం కావాలనుకుంటే నిపుణుల వద్దకు రావాల్సిందేనని స్పష్టం చేయండి.

Family Counselling:

-కె.శోభ,
ఫ్యామిలీ కౌన్సెలర్,
హార్ట్ టు హార్ట్,
[email protected]

Also Read:

https://idhatri.com/%e0%b0%aa%e0%b0%bf%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%aa%e0%b0%bf%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%86%e0%b0%b2%e0%b1%8b%e0%b0%9a%e0%b0%a8%e0%b0%b2%e0%b1%81/

Also Read:

పిల్లల్ని తప్పుపడతాం గానీ పెద్దవాళ్ళు చేసేవన్నీ ఒప్పులు కావు

RELATED ARTICLES

Most Popular

న్యూస్