అమరరాజా సంస్థలకు ఆంధ్ర ప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇచ్చిన మూసివేత ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. చిత్తూరు జిల్లాలో నూనెగుండ్లపాడు, కరకంబడి పరిధిలో ఉన్నఅమర్ రాజా పరిశ్రమలు మూసివేయాలంటూ ఏపి కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) ఆదేశాలు జారీచేసింది.
కంపెనీల నుండి వెలువడే వ్యర్దాల్లో రక్త సీస విలువలు అధికంగా (బ్లడ్ లీడ్ వాల్యూ) ఉన్నాయని, వీటివల్ల పరిసర గ్రామాల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని పిసిబి తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులపై అమరరాజా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.