Saturday, November 23, 2024
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్ చరిత్ర పుటల్లోకి ఎక్కబోతోంది

ఇజ్రాయెల్ చరిత్ర పుటల్లోకి ఎక్కబోతోంది

ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశమైనా(శ్రీలంకలో ఇది మూడో వంతు ఉంటుంది) ఎన్నో అసాధ్యమైన విషయాల్ని అతి కొద్ది కాలంలో సాధించిన దేశంగా ప్రసిద్ధి చెందింది (స్వాతంత్య్రం ఇండియాకు 1947 లో వస్తే ఇజ్రాయెల్ కు 1948 లో వచ్చింది). ఇపుడు కరోనా పై విజయం సాధించిన మొట్టమొదటి దేశంగా ఇజ్రాయెల్ చరిత్ర పుటల్లోకి ఎక్కబోతోంది. ఇజ్రాయెల్ లో రేపటినుండి ఎవరూ మాస్కులు ధరించనవసరం లేదని, ఇతర కోవిడ్ జాగ్రత్తలు కూడా పాటించనవసరం లేదని, దేశంలో వైరస్ ను సంపూర్తిగా నిర్ములించేశామని ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ ప్రజలనుద్దేశించి నిన్న ప్రకటించింది. పైగా పాలస్తీనియన్లతొ సహా తమ దేశంలోని పౌరులందరికీ నూటికి నూరు శాతం వాక్సినేషన్ చేసేశారు. ఇజ్రాయెల్ తమ వాక్సిన్ ను తామే తయారు చేసుకొని యుద్ధ ప్రాతిపాదికపై పౌరులందరికీ ఉచితంగా అందజేసింది. పైగా తమ దేశంలో వాక్సిన్ తీసుకున్నవాళ్లంతా కోవిడ్ నుండి విముక్తి పొంది క్షేమంగా ఉన్నారని సంపూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాతే ప్రభుత్వం నిన్న ఈ ప్రకటన చేసింది. ఇపుడు తమ దేశంలో పర్యాటక రంగాన్ని పునరుద్ధరించేందుకు, ఇతర దేశాల నుండి పర్యాటకులను మళ్ళీ ఆహ్వానించేందుకు ఇజ్రాయెల్ చర్యలు తీసుకొంటోంది. ఇజ్రాయెల్ లో 25 శాతం మంది ప్రజలు హోటళ్లు తదితర పర్యాటక సంబంధమైన రంగాల్లో, వృత్తుల్లో పనిచేస్తున్నారు. వాళ్లందరికీ తిరిగి జీవనోపాధి కలిగించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఇతర దేశాల నుండి వచ్చే పర్యాటకుల ద్వారా తమ దేశంలో కోవిడ్ తిరిగి వ్యాపించకుండా కూడా చాలా కట్టుదిట్టమైన చర్యలు ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకొంటోంది. కోవిడ్ వైరస్ కలిగి ఉన్న వారిని రెండు కిలో మీటర్ల దూరం నుండే పసిగట్టి సంబంధిత అధికారులకు వాళ్ళ సమాచారమిచ్చే రాడార్ లాంటి ఒక పరికరాన్ని వాళ్ళు ఇప్పటికే తయారు చేశారని, తమ విమానాశ్రయాలు, నౌకా రేవులు, ఇమ్మిగ్రేషన్ కేంద్రాల్లో వాటిని ఏర్పాటు చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. కోవిడ్ నుండి మన ప్రపంచం కూడా త్వరలో విముక్తి పొంది మామూలు పరిస్థితులు మళ్ళీ పూర్తిగా నెలకొంటాయనడానికి, అందులో ఇజ్రాయెల్ ముఖ్యమైన పాత్ర వహించబోతోందనడానికి ఇదొక శుభప్రదమైన సూచనగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ఏది చేసినా సంచలనమే, అపూర్వమే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్