ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ పి ఎల్)-2021 ను రద్దు చేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా కోవిడ్ రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఐపిఎల్లో ఆడుతున్న పలువురు ఆటగాళ్ళు, సహాయక సిబ్బంది కూడా కోవిడ్ బారిన పడ్డారు. నిన్న జరగాల్సిన కోల్ కత్తా – బెంగుళూరు మ్యాచ్ కూడా వాయిదా పడింది. ఈ నేపధ్యంలో ఈ లీగ్ ను కొంతకాలం పాటు తాత్కాలికంగా వాయిదా వేయాలా లేదా పూర్తిగా రద్దు చేయాలా అన్న విషయాన్ని తేల్చేందుకు బిసిసిఐ అత్యవసరంగా సమావేశం అయ్యింది.
కోవిడ్ వేగంగా వ్యాపిస్తూ, ఆక్సిజన్ అందక వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో ఐ పి ఎల్ ను నిర్వహించడం సబబు కాదని గత కొన్ని రోజులుగా విమర్శలు వస్తున్న తరుణంలో పూర్తిగా రద్దు చేయాలని బిసిసిఐ తీర్మానించింది.