Tuesday, December 3, 2024
HomeTrending Newsకరోనాపై పోరుకు విరుష్క చేయూత

కరోనాపై పోరుకు విరుష్క చేయూత

కరోనా విపత్తులో ప్రజలను ఆదుకునేందుకు మరో ముందగుడు వేశారు విరాట్ కోహ్లి – అనుష్క (విరుష్క) దంపతులు. కేటో వెబ్ సైట్ ద్వారా విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. కరోనాపై పోరుకు ఇప్పటికే 2 కోట్ల రూపాయల సాయాన్ని అందించిన ఈ దంపతులు తమ వంతుగా మరింత సాయం అందించాలని భావిస్తున్నారు.

కోహ్లి అనుష్కలు సంయుక్తంగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కరోనా మహమ్మారిపై దేశమంతా యుద్ధం చేస్తోందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు అలుపెరగని పోరాటం చేస్తున్నారని, వారికి అండగా ఉండాల్సిన బాధ్యత మనదరిపైనా వుందని వారు పిలుపు ఇచ్చారు. అందరం మనకు తోచినంత సహాయం చేసి, కరోనాను కలిసి కట్టుగా అంతం చేద్దామని విరుష్క దంపతులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్