విపక్షాలకు ఉమ్మడి కార్యాచరణ, అజెండా అవసరమని రాజ్యసభ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ట్వీట్ చేశారు. ప్రతిపక్షాలు వ్యక్తిగత ప్రయోజనాలను త్యాగం చేసి, తమ ఆలోచనలు కలిసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన సూచించారు. కర్ణాటకలో కాంగ్రెస్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి చెప్పుకోదగ్గ సంఖ్యలో ప్రముఖ ప్రతిపక్ష నాయకులు హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చాలా మంది ప్రతిపక్ష నాయకులు హాజరైన ఈ సభ ప్రతిపక్షాల ఐక్యతకు సంకేతమా అని ఆయన ప్రశ్నించారు. విపక్షాలు భ్రమలు వీడి పని చేయాలన్నారు. అయితే కర్ణాటక సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఢిల్లీ సీఎంలను ఆహ్వానించకపోవడం గమనార్హం.