కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడికి అండగా ఉందామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు సూచించారు. దేశం యావతూ కోవిడ్ పై యుద్ధం చేస్తున్న తరుణంలో రాజకీయ విమర్శలు సరికాదని, ఇవి మన జాతీయతను బలహీన పరుస్తాయని జగన్ అభిప్రాయపడ్డారు.
గురువారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోనులో మాట్లాడారు. దీనిపై హేమత్ సోరెన్ ట్వీట్ చేశారు. ‘గౌరవనీయ ప్రధాని మోడీ ఫోన్ చేశారు, అయన మన్ కీ బాత్ అయన మాట్లాడారు. అయన ఆలోచనలు, అభిప్రాయాలు చెప్పారు తప్ప మేం చెప్పేది వినలేదు’ అంటూ ట్వీట్ చేశారు. ‘ప్రధాని నాలుగు మాటలు చెబుతారని, మేం చెప్పేది కూడా వింటారని ఆశించాం’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ‘ మా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు, 50 వేల రేమిడిసివర్ ఇంజెక్షన్లు బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకుందామంటే ఇంతవరకూ పర్మిషన్ ఇవ్వలేదు అంటూ సోరెన్ వాపోయారు.
హేమంత్ ట్వీట్ కు రీ-ట్వీట్ చేసిన జగన్ కరోనా విపత్తు వేళ విమర్శలు సహేతుకం కాదని, ప్రధానికి అండగా ఉందామని కోరారు.