Saturday, January 18, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్రఘురామకు వైద్య పరీక్షలు పూర్తి

రఘురామకు వైద్య పరీక్షలు పూర్తి

నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజుకి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరిక్షలు పూర్తయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం ఎంపికి రక్త, చర్మ, ఇతర పరీక్షలు నిర్వహించారు. బయటి నుంచి చర్మవ్యాధి నిపుణుడిని రప్పించి పరీక్షించినట్లు తెలిసింది.

తెలంగాణా హైకోర్టు నియమించిన జ్యుడిషియల్ అధికారి నాగార్జున ఈ నివేదికను హైకోర్టుకు అందజేశారు. డాక్టర్ల నివేదికతోపాటు.. వీడియో ఫుటేజిని సీల్డ్‌ కవర్‌లో సుప్రీంకోర్టుకు మంగళవారం సాయంత్రం తెలంగాణ హైకోర్టు పంపింది.

సుప్రీంకోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న రఘురామకృష్ణరాజుకు ఇక్కడే చికిత్స అందిస్తామని సికింద్రాబాద్‌ సైనికాసుపత్రి వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. శుక్రవారం ఈ కేసును సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపడుతుంది. బెయిల్ పిటిషన్ పై అఫిడవిట్ సమర్పించాల్సిందిగా ఏపి ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించిన సంగతి తెలిసిందే.
.

RELATED ARTICLES

Most Popular

న్యూస్