Thursday, January 23, 2025
HomeTrending Newsవరంగల్-సుధారాణి; ఖమ్మం-నీరజ

వరంగల్-సుధారాణి; ఖమ్మం-నీరజ

గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ మేయర్ గా గుండు సుధారాణి, ఖమ్మం మేయర్ గా పునుకొల్లు నీరజ పేర్లను సిఎం కెసిఆర్ ఖరారు చేశారు. వరంగల్ డిప్యూటి మేయర్ గా రిజ్వానా షమీమ్, ఖమ్మం డిప్యూటీ మేయర్ గా ఫాతిమా జోహ్రాలకు అవకాశం కల్పించారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో డిప్యూటి మేయర్ పదవులు మైనార్టీలకు దక్కాయి. నేటి ఉదయం కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రం ౩ గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహించారు.

మునిసిపాలిటీల్లో…. అచంపేట్ చైర్మన్ గా ఎడ్ల నరసింహ గౌడ్; వైస్ చైర్మన్ గా శైలజా విష్ణువర్ధన్ రెడ్డి…. జడ్చర్ల చైర్మన్ గా దోరేపల్లి లక్ష్మి నరేందర్, వైస్ చైర్మన్ గా సారికా రామ్మోహన్…. నకిరేకల్ చైర్మన్ గా రాచకొండ శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా ఉమారాణి…..సిద్దిపేట చైర్మన్ గా కడవేర్గు మంజుల; వైస్ చైర్మన్ గా జంగిటి కనకరాజు…. కొత్తూరు చైర్మన్ గా లావణ్య వైస్ చైర్మన్ గా రవీందర్ లు ప్రమాణం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్