Tuesday, April 15, 2025
HomeTrending Newsసొరాబ్జి మృతికి ఏపీ సిఎం జగన్ సంతాపం

సొరాబ్జి మృతికి ఏపీ సిఎం జగన్ సంతాపం

న్యాయశాస్త్ర కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జి మృతికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. న్యాయ రంగంలో ఆయనకున్న అపార అనుభవం మానవ హక్కుల పరిరక్షణకు ఎంతగానో దోహదపడిందని కొనియాడారు. 91 సంవత్సరాల సొరాబ్జి కోవిడ్ వైరస్ బారిన పడి ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేటి ఉదయం మరణించారు.
ఐక్యరాజ్య సమితిలో మానవ హక్కుల విభాగం ప్రతినిధిగా, నైజీరియాలో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధిగా సేవలందించిన సొరాబ్జిని కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ తో సత్కరించింది. సొరాబ్జి కుటుంబ సభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్