పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు. శ్రీనివాస్ స్క్రీన్ ప్లే సంభాషణలు అందించారు. ఇటీవల రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ సినిమా పై మరింత ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమా రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే ఈ రెండు పాటలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. జులై 28న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇది తమిళ్ లో విజయం సాధించి వినోదయ సీతమ్ సినిమాకు రీమేక్. అక్కడ చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. తెలుగులోకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీ ఫ్రేమ్ లోకి రావడంతో బడ్జెట్ అమాంతం పెరిగింది. ఈ చిత్రానికి బడ్జెట్ 120 కోట్లు అయ్యిందని సమాచారం. అయితే.. బిజినెస్ విషయానికి వస్తే… థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి 175 కోట్ల బిజినెస్ జరిగిందని వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ క్రేజ్ పాటు తేజ్ కూడా ఈ మూవీలో ఉండటం వలన బిజినెస్ ఎక్కువగా జరిగిందని టాక్.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా 200 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందనేది ట్రేడ్ పండితులు అంచనా అని తెలిసింది. ఆల్రెడీ తమిళ్ లో సక్సెస్ అయిన మూవీ కాబట్టి ఖచ్చితంగా పవన్ ఇమేజ్ తో సినిమాకి మరింత హైప్ వచ్చి జనాల్లోకి భాగా వెళుతుంది అంటున్నారు మేకర్స్. ఇక పవన్ కళ్యాణ్ కెరియర్ లో హైయెస్ట్ బిజినెస్ జరిగిన చిత్రంగా ఇప్పుడు బ్రో నిలిచిది. మరి… బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించి సరికొత్త రికార్డులు సెట్ చేస్తుందేమో చూడాలి.