Wednesday, June 26, 2024
Homeసినిమాథమన్ చేతుల మీదుగా ‘ముఖచిత్రం’ లిరికల్ సాంగ్ రిలీజ్

థమన్ చేతుల మీదుగా ‘ముఖచిత్రం’ లిరికల్ సాంగ్ రిలీజ్

Mukha Chitram: వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ముఖచిత్రం. కలర్ ఫొటో మూవీతో హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ రాజ్ ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. కాల భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత ఎస్కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకం పై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్ అనే కొత్త దర్శకుడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు.

ఫన్ అండ్ ఇంటెన్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ  సినిమాలోని క్లాస్ రూమ్ లో లిరికల్ సాంగ్ ను సంగీత దర్శకుడు థమన్ విడుదల చేశారు. పాట చాలా బాగుందన్న థమన్ చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు.

“నువ్వెక్కడుంటే నేనక్కడుంటా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. ప్రతి ఒక్క చోటా అతుక్కు పోతా నీ నుంచి దూరం ఎంత కష్టమో. మాథ్స్ లో నీ ఊసులేగా, సైన్స్ లో నీ ఊహలేగా..” ఇలా విద్యార్థి జీవితపు ప్రేమకథను అందంగా రచించారు రామజోగయ్యశాస్త్రి. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చడంతో పాటు సింధూరి విశాల్ తో కలిసి పాడారు. దర్శకుడు సందీప్ రాజ్ “కలర్ ఫొటో” సినిమాలో తరగది గది దాటి పాట సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆయన కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్న ముఖచిత్రం సినిమాలోనూ క్లాస్ రూమ్ లో పాట ఆ ఫీల్ తోనే సాగుతూ ఆకట్టుకుంటోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్