ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ పేలిన ఘటనలో 15 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. జిల్లాలోని అలకనంద నదీ సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లో అకస్మాత్తుగా పేలుడు జరిగింది. గాయపడ్డవారిని జిల్లా ఆస్పత్రిలో చేర్పించినట్లు ఎస్పీ పర్మేంద్ర దోవల్ తెలిపారు. మృతిచెందిన 15 మందిలో పీపల్‌కోట్ ఔట్‌పోస్టు ఇంచార్జీ కూడా ఉన్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు.
నమామి గంగే ప్రాజెక్టు కోసం జరుగుతున్న నిర్మాణ పనుల దగ్గర ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో విద్యుత్తు షాక్ తగిలింది. దీంతో అక్కడ పనిచేస్తున్న వారికి షాక్ తగిలింది. గాయపడ్డవారిని చికిత్స కోసం హెలికాప్టర్‌లో రిషికేశ్ ఎయిమ్స్‌కు తరలించారు. డెహ్రాడూన్ నుంచి చమోలీలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని విజిట్ చేసేందుకు సీఎం పుష్కర్ సింగ్ ధామి బయలుదేరి వెళ్లారు