Sunday, January 19, 2025
HomeTrending Newsపది కాదు, మీ ముగ్గురూ గెలవండి : అనిల్ సవాల్

పది కాదు, మీ ముగ్గురూ గెలవండి : అనిల్ సవాల్

వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్ర శేఖర రెడ్డిలకు ఓటమి తప్పదని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ ముగ్గురూ గెలిచి అసెంబ్లీకి వస్తే తాను రాజకీయాలకు స్వస్తి చెబుతానని ఛాలెంజ్ చేశారు. నేను గెలిచి అసెంబ్లీకి వస్తే.. వారు రాజకీయాల నుంచి వెళ్లిపోతారా  ప్రశ్నించారు.  2024 ఎన్నికల్లో ఎవరు అసెంబ్లీకి వస్తారో తేల్చుకుందామని సవాల్ చేశారు. ఈసారి అనిల్ ను శాసనసభకు రానీయమంటూ కొందరు మంగమ్మ శపథాలు చేస్తున్నారని,  ఇటీవల పసుపు కండువా కప్పుకున్న కొందరు జిల్లాలో పదికి పది స్థానాలు సాధిస్తామని చెబుతున్నారుని , పది కాదని కనీసం పార్టీ వీడిన ముగ్గురూ గెలవాలన్నారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ బొమ్మతోనే ఎన్నికల్లో పోటీ చేస్తా, గెలుస్తా దమ్ముంటే తనను ఆపాలన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్ల డం వల్ల జిల్లాలో వైసీపీకి ఊడిందేమీ లేదని… కార్యకర్తలు, ప్రజలు జగన్ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.  వచ్చే ఎన్నికల్లోను జగన్ కు ఓట్లు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

Also Read :Ap Mlc Election: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యం ఫలితం; టిడిపి గెలుపు

RELATED ARTICLES

Most Popular

న్యూస్