Custody: మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను చిత్తూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పడవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ప్రశ్నించేందుకే ఆయన్ను హైదరాబాద్ కొండాపూర్ లోని ఆయన ఇంట్లో పోలీసులు అరెస్టు చేశారు. విచారణ కోసం ఆయన్ను సొంత కారులోనే చిత్తూరు తరలిస్తున్నారు. నారాయణతో పాటు అయన భార్య రమాదేవి కూడా కారులో ఉన్నారు.
చిత్తూరు జిల్లాలో నారాయణ స్కూల్ నుంచి టెన్త్ పేపర్లు లీకైనట్లు గుర్తించిన పోలీసులు ఈ కేసులో ఇప్పటికే వైస్ ప్రిన్సిపల్ గిరిధర్‌తోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. గత 4 రోజులుగా ఫోన్ స్విఛాప్ చేసి అజ్ఙాతంలో ఉన్న నారాయణను నేడు పోలీసులు అదుపులో తీసుకున్నారు.
ఇటీవలే తిరుపతిలో జరిగిన సభలో సిఎం జగన్ సైతం పదో తరగతి ప్రశ్నా పత్రాలు నారాయణ, చైతన్య విద్యా సంస్థల నుంచే లీకయ్యాయని వెల్లడించిన సంగతి తెలిసిందే.