Wednesday, June 26, 2024
Homeసినిమా'అమిగోస్' తో పరిచయమవుతున్న అందాల రాశి!

‘అమిగోస్’ తో పరిచయమవుతున్న అందాల రాశి!

ఒకప్పుడు తెలుగు సినిమాపై బాలీవుడ్ కథలు .. తమిళ కథల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఈ రెండు భాషలకి చెందిన సినిమాలను తెలుగులో ఎక్కువగా రీమేక్ చేసేవారు. అందువలన సహజంగానే ఈ రెండు భాషలకి చెందిన హీరోయిన్స్ ఇక్కడివారికి తెలియడం, వాళ్లు ఇక్కడ కూడా బిజీ కావడం జరిగింది. ఇక ఆ తరువాత మలయాళ కథలు టాలీవుడ్ బాట పట్టడం .. అక్కడి హీరోయిన్స్ తెలుగు తెరపై స్టార్ డమ్ ను కొనసాగించడం జరుగుతూ వస్తోంది. ఇప్పుడు వీటికి తోడు కన్నడ ఇండస్ట్రీ కూడా టాలీవుడ్ పై ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. అక్కడి సినిమాలతో పాటు హీరోయిన్స్ కూడా ఇక్కడికి ఎక్కువగానే వచ్చేస్తున్నారు.

ప్రస్తుతం కన్నడ నుంచి వచ్చిన రష్మిక .. ఇక్కడ టాప్ త్రీ హీరోయిన్స్ లో ఒకరు. ‘పుష్ప’ సినిమాతో ఆమె పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. ప్రస్తుతం తెలుగు .. తమిళ .. హిందీ  భాషల్లోను భారీ ప్రాజెక్టులు చేస్తోంది. ఇక ‘కేజీఎఫ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో శ్రీనిధి శెట్టి .. ‘కాంతార’ వంటి సూపర్ హిట్ తో సప్తమి గౌడ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇద్దరూ మంచి అందగత్తెలే కావడంతో, తెలుగు నుంచి వీరికి భారీ ఆఫర్స్ వెళుతున్నాయని వినికిడి. ఇద్దరూ మంచి హైట్ కావడం వలన, అందుకు తగిన హీరో జోడీ దొరకవలసి ఉంటుంది మరి.

ఈ నేపథ్యంలోనే మరో కన్నడ భామ తెలుగు సినిమాతో ప్రేక్షకులకు పరిచయం కావడానికి రెడీ అవుతుంది. ఆ బ్యూటీ పేరే ‘ఆషిక రంగనాథ్‘. 2016 నుంచి తన కెరియర్ ను మొదలెట్టిన ఈ సుందరి, ‘అమిగోస్’ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నాయికగా ఛాన్స్ కొట్టేసింది. చక్కని కనుముక్కుతీరుతో .. ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకునే ఆషిక రంగనాథ్ కి, తెలుగు ప్రేక్షకులు కోరుకునే గ్లామర్ కావాల్సినంత ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, ఫిబ్రవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో ఈ బ్యూటీ ఇక్కడ సెటిలైపోతుందేమో చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్