Monday, March 31, 2025
HomeTrending Newsఎమ్మెల్యే రాజసింగ్ కు బెయిల్ మంజూరు

ఎమ్మెల్యే రాజసింగ్ కు బెయిల్ మంజూరు

హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. షరతులతో కూడిన బెయిల్ ని ఆయనకు మంజూరు చేసింది కోర్టు. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అంటూ హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా రాజాసింగ్ ప్రెస్ మీట్, సభలు, ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనకూడదని తెలిపింది.

కాగా రాజాసింగ్ 2 నెలలుగా చర్లపల్లి జైలులోలులో ఉంటున్నారు. రాజాసింగ్ మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆగస్టు 25న ఆయనపై పీడీ యాక్ట్ నమోదైన విషయం తెలిసిందే. బిజెపి హై కమాండ్ సైతం ఆయనపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరలోనే బిజెపి హై కమాండ్ రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్