Sunday, January 19, 2025
HomeTrending Newsవైఎస్ కుటుంబంతోనే నా రాజకీయం: బాలినేని

వైఎస్ కుటుంబంతోనే నా రాజకీయం: బాలినేని

తాను జనసేన పార్టీలోకి వెళ్తున్నట్లు వస్తోన్న ప్రచారాన్ని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు.  తనకు రాజకీయ భిక్ష పెట్టిందే దివంగతనేత  వైఎస్సార్ అని, జగన్ పార్టీ పెట్టగానే అందులో చేరానని.. తానెప్పుడూ ఊసరవెల్లి రాజకీయాలు చేయబోనని స్పష్టం చేశారు. కష్ట నష్టాలు ఎదురైనా వైఎస్ జగన్ తోనే ఉంటాను తప్ప పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. చేనేతలకు సంబంధించి పవన్ చేసిన ఓ ట్వీట్ కు తాను స్పందిచానని చెప్పారు.  నిన్న గిద్దలూరు పార్టీ కార్యకర్తల సమావేశం పెట్టానని, దాన్ని పార్టీ మార్పు కోసం కార్యకర్తల సమావేశం అన్నట్లు కొన్ని మీడియా చానళ్ళు చిత్రీకరించడం దురదృష్టకరమన్నారు.

ఈ మధ్య కాలంలో ఏమాత్రం సంబంధం లేని అంశాల్లో తన పేరు తీసుకు వచ్చి దుష్ప్రచారం చేస్తున్నారని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలుకు చెందిన సుబ్బారావు గుప్తా కు బట్టల షాప్ పెట్టుకోడానికి రఘురామకృష్ణంరాజు సాయం చేశారని, దానికి వైసీపీ నేతలు కోడా సహకరించారని.. అన్నీ గమనిస్తున్నానని, కానీ తాను సంయమనంతో వ్యవహరిస్తున్నానని చెప్పారు. పదవులు కొన్నే ఉంటాయని, అందరికీ ఇవ్వడం సాధ్యం కాదన్నారు.

త్వరలోనే సిఎం జగన్ ను కలిసి అన్ని విషయాలూ చెబుతానని, రాజకీయాల్లో ఉన్నంతకాలం తాను వైసీపీలోనే ఉంటానని, లేకపోతే రాజకీయాలు మానేస్తానాన్ని, వేరే గడప తొక్కడం తనకు చేతకాదని వెల్లడించారు. వైఎస్ కుటుంబానికి తాను రుణపడి ఉంటానన్నారు.

Also Read రిపీట్ అయితే జాగ్రత్త: బాలినేని వార్నింగ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్