Sunday, November 24, 2024
HomeTrending Newsగిరిజన రిజర్వేషన్లు అమలు చేయాలి - బండి సంజయ్

గిరిజన రిజర్వేషన్లు అమలు చేయాలి – బండి సంజయ్

బీజేపీ అధికారంలోకి వస్తే తండాల సమగ్రాభివ్రుద్ధి కోసం ప్రత్యేకంగా డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీనిచ్చారు. సేవాలాల్ నడయాడిన బంజారా హిల్స్ లో సేవాలాల్ మందిరాన్ని నిర్మించి ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివ్రుద్ధి చేస్తామని పేర్కొన్నారు. సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సన్ నాయక్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడారు.

అందులోని ముఖ్యాంశాలు..

నరేంద్రమోదీ ప్రభుత్వ 8 మంది గిరిజనులకు కేబినెట్ లో స్థానం కల్పించారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా చేశారు. తెలంగాణలో మాత్రం కేసీఆర్ గిరిజనులను మోసం చేస్తున్నారు. సేవాలాల్ మహారాజ్ సహా అంబేద్కర్, పూలె, జగ్జీవన్ రాం వంటి ప్రముఖుల జయంతి, వర్దంతిలకు హాజరుకారు… మంచి నీటి కోసం తండాల్లో ఇంకా అల్లాడుతున్నరు. మిషన్ భగీరథ నీళ్ల ఊసే కన్పించడం లేదు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినట్లు ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ నయా పైసా నిధులు కేటాయించడం లేదు. ఉపాధి లేక పనుల కోసం పట్టణాలకు వలస వెళుతున్నారు. ఇయాళ హైదరాబాద్ లో ఏ అడ్డా మీద చూసినా లంబాడ కూలీలే కన్పిస్తారు. హైదరాబాద్ లో ఏ ఆటో డ్రైవర్ ను పలకరించినా లంబాడ యువకులే కన్పిస్తారు. ఇంటర్, డిగ్రీ చదివిని లంబాడ యువకులు ఉద్యోగాల్లేక, సొంతంగా వ్యాపారం చేసుకునే స్తోమత లేక ఆటోలను అద్దెకు తీసుకుని బతుకీడుస్తున్నారు. పేరుకే హైటెక్ సిటీలో ఉంటున్నా వాళ్లుండే ఇల్లు అత్యంత దుర్భరమైనవి. కాళ్లు చాపుకుని పడుకునే పరిస్థితి కూడా ఉండని గుడెసెల్లో, రేకుల షెడ్లలో బతుకుతున్నారు.
గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానని మాట ఇచ్చి తప్పిన మోసగాడు కేసీఆర్. పోడు భూములకు పట్టాలిస్తానని హామీ ఇచ్చి ఏళ్ల తరబడి అమలు చేయకుండా జాప్యం చేస్తున్న దుర్మార్గుడు. కేసీఆర్ కు దమ్ముంటే గిరిజన రిజర్వేషన్లను అమలు చేయాలి. పొరుగు రాష్ట్రంలో తండాల అభివ్రుద్ధికి డెవలెప్ మెంట్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తున్నారు. తెలంగాణలో ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? బీజేపీ అధికారంలోకి వస్తే తండాల అభివ్రుద్ధికి ప్రత్యేకంగా డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తాం. బంజారాహిల్స్ లో సేవాలాల్ మహారాజ్ మందిరాన్ని నిర్మించి ప్రముఖ పుణ్య క్షేత్రంగా విరాజిల్లేలా తీర్చిదిద్దుతాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్