బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారని, జీ.హెచ్.ఎం.సీ పరిధిలో 256 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఉచితంగా వైద్య సేవలు, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయన్నారు. బస్తీ దవాఖానాల్లో అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారని, టీ డయాగ్నసిస్ ద్వారా 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారని మంత్రి వివరించారు. సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం మండలం ,ఎస్.ఎన్ కాలనీ, బొంబాయి కాలనీ, LIG భారతీ నగరి కాలనీలో బస్తీదవాఖానాలు ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు. ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని, ఈ మోడల్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ బస్తీ దవాఖానాలు అన్ని రాష్ట్రాల్లో పెట్టాలని 15 వ ఆర్థిక సంఘం సూచించిందని మంత్రి తెలిపారు.
టీ డయాగ్నసిస్ ద్వారా రక్తం ఇస్తే అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేసి రిపోర్ట్ సెల్ ఫోన్లకు అందుతుందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ పరిథిలో 256 బస్తీదవాఖానాల ద్వారా సగటున ప్రతీ రోజు 2 లక్షల 50 వేలమంది ఉచిత వైద్యం అందుతోందన్నారు. పఠాన్ చెరులో ఇప్పటికే 3 బస్తీ దవాఖానాలున్నాయి. ఇవాళ మరో మూడు కొత్త దవాఖానాలు ప్రారంభించుకున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇక మందులు లేవు అన్న సమస్యే ఉండదని, పాము కాటు, కుక్క కాటు, డెంగ్యూ, మలేరియా సహా అన్ని రకాల మందులు ప్రభుత్వ ఆసుుత్రుల్లో అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటి వరకు కరోనా సేనలు అందించిన గచ్చిబౌలి లోని టిమ్స్ లో ఇక అన్ని రకాల వైద్య సేవలు , కార్పోరేట్ ఆసుపత్రుల స్థాయిలో అందుబాటులో ఉంటాయన్నారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో అందే అన్ని రకాల వైద్య సేవలు, గుండె,కిడ్నీ, కాలేయం సంబంధిత సర్జరీలు ఉచితంగా పేదలకు టిమ్స్ ద్వారా అందిస్తామన్నారు.
7280 కోట్లతో మన ఊరు – మన బడి పేరుతో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల సౌకర్యాలు కల్పించనున్నామని, డిజిటల్ క్లాస్ రూంలు, క్లాస్‌రూం కు రంగులు, మంచి బోర్డులు, బాతు రూం, మంచి నీరు ఇలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. బొంబాయి కాలనీలోని పాఠశాలను తొలి విడతగా అభివృద్ధి చేస్తాం. పేద పిల్లలకు కార్పోరేట్ తరహా ఆంగ్ల మాధ్యమంలో విద్య అందిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, కార్పోరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు