Saturday, February 22, 2025
HomeసినిమాBhagavanth Kesari Trailer: భగవంత్ కేసరి ట్రైలర్ బాగుంది కానీ..?

Bhagavanth Kesari Trailer: భగవంత్ కేసరి ట్రైలర్ బాగుంది కానీ..?

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘భగవంత్ కేసరి’. ఇందులో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తే.. కూతురుగా శ్రీలీల నటించింది. ఈ సినిమాను ప్రకటించినప్పుడు ఇది బాలయ్య స్టైల్ లో ఉంటుందా..? లేక అనిల్ రావిపూడి స్టైల్ లో ఉంటుందా..? అనే డౌట్ అందరిలో ఉంది. ఇప్పుడు భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి.. ట్రైలర్ టాక్ ఏంటి..?

ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాలయ్య పెద్దరికం ఉన్న తండ్రి పాత్రలో కనిపించారు. బాలయ్య, శ్రీలీల, విలన్ అర్జున్ రాంపాల్ చుట్టూనే కథ ఉంటుందనే క్లారిటీ వచ్చింది కానీ.. విలన్ తో బాలయ్య ఎందుకు గొడవ అనేది క్లారిటీ లేదు. అయితే.. ఇందులో రెగ్యులర్ డ్యూయెట్లు.. రెగ్యులర్ గా ఉండే భారీ డైలాగులు అంతగా లేవు అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే… కొత్తగా ఉంది. ఈ జోనర్ బాలయ్య, అనిల్ రావిపూడి ఇద్దరికీ కొత్తే. చూస్తుంటే.. అనిల్ రావిపూడి ఈసారి కొత్తగానే ట్రై చేశాడు అనిపిస్తుంది. అసలు కథ ఏంటి అనేది రివీల్ చేయలేదు. దీంతో సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది.

అయితే.. ట్రైలర్ బాగుంది కానీ.. బాలయ్య సినిమా అంటే భారీ డైలాగులు.. అదిరిపోయే యాక్షన్ సీన్లు, హీరోయిన్ తో రొమాన్స్, డ్యూయట్లు ఉండాలని అభిమానులు కోరుకుంటారు. కొత్తదనం కోసమని అవి లేకుండా తీస్తే మాత్రం ఫ్యాన్స్ ఫీలవుతారు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించిన తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడంతో భగవంత్ కేసరి సినిమా పై భారీ అంచనాలు  ఉన్నాయి. ఈ నెల 19న భగవంత్ కేసరి చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. మరి.. బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్