Sunday, January 19, 2025
HomeTrending Newsభారత్ జోడో యాత్రలో.. స్వర భాస్కర్

భారత్ జోడో యాత్రలో.. స్వర భాస్కర్

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కొన‌సాగుతోంది. 83వ రోజు పాద‌యాత్ర‌లో ఈ రోజు (గురువారం) బాలీవుడ్ న‌టి స్వ‌ర భాస్క‌ర్‌, ఉత్త‌రాఖండ్ మాజీ సీఎం హ‌రీష్ రావ‌త్‌లు రాహుల్‌తో క‌లిసి న‌డిచారు. రాహుల్ యాత్ర ప్ర‌స్తుతం ఉజ్జ‌యిని మీదుగా సాగుతోంది. మోదీ స‌ర్కార్ విధానాల‌ను ఎండ‌గ‌డుతూ, కేంద్ర ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. బిజెపి విధానాలను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించే బాలీవుడ్ నటి స్వర భాస్కర్ భారత్ జోడో యాత్రలో పాల్గొనటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే బాలీవుడ్ నటులు రాహుల్ గాంధి పాదయాత్రలో పాల్గొనటాన్ని అతిథి పాత్రలుగా బిజెపి నేతలు అభివర్ణించారు.

సెప్టెంబ‌ర్ 7న క‌న్యాకుమారిలో ప్రారంభ‌మైన భార‌త్ జోడో యాత్ర ఇప్ప‌టివ‌ర‌కూ కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ 6 రాష్ట్రాల్లోని 36 జిల్లాల మీదుగా 1209 కిలోమీట‌ర్లు సాగింది. దేశ ప్ర‌జ‌ల‌ను ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చే ల‌క్ష్యంతో రాహుల్ గాంధీ చేప‌ట్టిన ఈ యాత్ర కశ్మీర్‌లో ముగుస్తుంది. భార‌త్ జోడో యాత్ర‌లో ఇప్ప‌టికే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాబ‌ర్ట్ వాద్రా స‌హా ప‌లువురు పార్టీ అగ్ర‌నేత‌లు, సీనియ‌ర్ నాయ‌కులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్