ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా తన పదవీ కాలంలో రాజ్యాంగ వ్యవస్థలు సమన్వయంగా పనిచేయడంలో బిశ్వభూషణ్ హరిచందన్ ఎంతో చొరవ చూపారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ఏపీలో ఒక ఆత్మీయుడైన పెద్దమనిషిగా, గవర్నర్ వ్యవస్థకు ఓ నిండుతనం తీసుకు వచ్చారని ప్రశంసించారు. ఏపీ గవర్నర్ గా పనిచేసి బదిలీపై ఛత్తీస్ గఢ్ కు వెళుతోన్న హరిచందన్ కు వీడ్కోలు పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ గవర్నర్ కు ఏపీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.
గవర్నర్ కు – రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంబంధాల విషయంలో ఇటీవలి కాలంలో కొన్ని వార్తలు చూస్తున్నామని, కానీ వాటికి భిన్నంగా తండ్రిగా, పెద్దలా, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రజా ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తూ హరిచందన్ ఎంతో వాత్సల్యం ప్రదర్శించారని అన్నారు.
స్వాతంత్ర్యం సమరయోధుడు కూడా ఆయిన హరిచందన్ ఐదు సార్లు ఒడిశా అసెంబ్లీకి ఎన్నికై నాలుగు పర్యాయాలు మంత్రిగా నాలుగు సార్లు మంత్రిగా కూడా పని చేశారని, 2000 ఎన్నికల్లో తన ప్రత్యర్థిపై దాదాపు 95వేల ఓట్ల రికార్డు మెజారిటీతో విజయం సాధించారని గుర్తు చేశారు. న్యాయవాదిగా కూడా పని చేసిన ఆయన ఒడిశా హైకోర్టులో బార్ అసోసియేషన్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా లాయర్ల సంక్షేమం, హక్కుల కోసం పాటుపడ్డారని పేర్కొన్నారు. బిశ్వభూషణ్ విజయంలో ఆయన సతీమణి సుప్రజ పాత్ర ఎంతో ఉందని, ఆమెకు కూడా ప్రభుత్వం తరఫున కుటుంబం తరపహున ధన్యవాదాలు తెలిపారు.
Also Read : హరిచందన్ తో సిఎం జగన్ భేటీ