Tuesday, September 17, 2024
HomeTrending NewsSuryapet: దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట - మంత్రి జగదీష్ రెడ్డి

Suryapet: దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట – మంత్రి జగదీష్ రెడ్డి

దివ్యాంగ విద్యార్థుల పట్ల మానవీయంగా ఆలోచిస్తున్న ప్రభుత్వం దేశం లో బీఆర్ఎస్ మాత్రమే అని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల బాధలు తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సూర్యాపేట లోని జిల్లా పరిషత్ పాఠశాల లో దివ్యాంగ విద్యార్థినీ, విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి 372మంది దివ్యాంగ విద్యార్థినీ, విద్యార్ధులకు 571 ఉపకరణాలను,100 బస్ పాస్ లను పంపిణీ చేశారు. ట్రై సైకిల్స్ 30, వీల్ చైర్స్ 80, సి.పి చైర్స్ 16, ఉపకరణాలతో పాటు ఇయరింగ్ మిషన్స్, క్యాలిపర్స్, బ్రెయిలీ కిట్లు, వాకర్ స్టిక్స్, రో లెటర్ వంటి ఉపకరణాలను అందజేశారు.  వీటితో పాటు రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా ఫ్రీ గా ఉండే పద్దతుల్లో బస్ పాస్ లను సైతం అందజేశారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా వివిధ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. దివ్యాంగ విద్యార్థులలో ఆత్మస్థైర్యం నింపి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అన్ని రంగాల్లో రాణించేలా చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగా స్వచ్ఛంద సంస్థలతో కలిసి అండగా ఉన్నామంటూ వారిని అక్కున చేర్చుకుంటోందన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అత్యాధునిక ఉపకరణాల పంపిణీకి నాంది పలికిందన్నారు.శారీరక వైకల్యం అనేది మెరుగైన జీవనానికి అడ్డంకి కాదని, వారికి మరింత తోడ్పాటునందిస్తే ఏదైనా సాధించగలరనే గొప్ప ఉద్దేశంతో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగులకు చేయూతనిస్తోంది అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహన్ని సద్వినియోగం చేసుకుని దివ్యాంగ చిన్నారులు తమ తమ జీవితాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రియాంక,sk నహీం, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్