బిజెపి లో ఎన్నికల సంస్కరణలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను మారుస్తూ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల అధ్యక్షులను మార్చింది.
ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురుందేశ్వరిని నియమించారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. పంజాబ్ అధ్యక్షుడిగా సునీల్ జాకర్, జార్ఖండ్ అధ్యక్షుడిగా బాబులాల్ మారండి, రాజస్థాన్ అధ్యక్షుడిగా గజేంద్ర సింగ్ షెకావత్ లను నియమిస్తున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అదే విధంగా తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటెల రాజేందర్ ను నియమించారు.