Monday, February 24, 2025
HomeసినిమాChiranjeevi: బ్రహ్మానందంను ప్రత్యేకంగా సత్కరించిన చిరంజీవి

Chiranjeevi: బ్రహ్మానందంను ప్రత్యేకంగా సత్కరించిన చిరంజీవి

Ram Charan: తెలుగు సినీ తెర పై ఒక్కసారి కమెడియన్ బ్రహ్మానందం అలా కనిపిస్తే చాలు.. స్టార్ నటీనటులకు ధీటుగా ఆయన సీన్స్‌కు రెస్పాన్స్ వస్తుంటుంది. ఆ విధంగా మొదటి నుండి తెలుగు ఆడియన్స్ ని తనదైన కామెడీ పాత్రలతో కడుపుబ్బా నవ్వించి ఆకట్టుకున్నారు బ్రహ్మానందం. అయితే తన కెరీర్ లో తొలిసారిగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘రంగమార్తాండ’ మూవీలో ఒక సీరియస్ రోల్‌లో కనిపించారు బ్రహ్మానందం. ఉగాది సందర్భంగా విడుదలైన రంగమార్తాండ మంచి మౌత్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా థియేటర్స్‌లో రన్ అవుతోంది.

సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ బ్రహ్మానందం నటనకు ముగ్దులవుతున్నారు. ఇన్నాళ్లు మనల్ని నవ్వించిన బ్రహ్మానందం ఇలా ఏడిపించేశారు ఏంటి.? అని అనుకుంటున్నారు. థియేటర్లో బ్రహ్మానందం సీన్లకు ప్రతీ ఒక్క ఆడియెన్ కంటతడి పెట్టేసుకుంటారు. బ్రహ్మానందం నటించిన పాత్రకు ఇంత మంచి పేరు రావడంతో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. శాలువాతో సత్కరించారు.

Also Read : Rangamarthanda: బ్రహ్మానందం నట విశ్వరూపమే ‘రంగమార్తాండ’! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్