రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తిరుపతిలో పర్యటించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆలయ ధర్మకర్తలు, అర్చకులు సిఎం జగన్ కు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆయలంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అరిపిరి వద్దకు చేరుకొని ఎపీఎస్ ఆర్టీసీ అధ్వర్యంలో తిరుపతి నుంచి తిరుమలకు ఏర్పాటు చేస్తోన్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. తదనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమల చేరుకున్నారు.
సిఎం వెంట డిప్యూటీ సిఎం కె. నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, స్థానిక ప్రజాపతినిధులు, అధికారులు ఉన్నారు.
Also Read : ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించనున్న సిఎం