Tuesday, February 25, 2025
HomeTrending Newsమహనీయుల బాటలో నడుద్దాం: సిఎం జగన్

మహనీయుల బాటలో నడుద్దాం: సిఎం జగన్

74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ” స్వ‌తంత్ర భార‌తదేశాన్ని గ‌ణ‌తంత్ర రాజ్యంగా మార్చిన‌ రాజ్యాంగం అమల్లోకి వ‌చ్చి 73 సంవ‌త్స‌రాలు పూర్తైన సంద‌ర్భంగా ఈ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నాడు మ‌న రాజ్యాంగక‌ర్త‌ల‌ను స్మ‌రించుకుంటూ వారి బాటలో న‌డిచి దేశ అభ్యున్న‌తికి కృషి చేద్దాం” అంటూ సందేశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.

సిఎం జగన్ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.  తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య, జాతీయ జెండా ఎగురవేసిన  అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులు  అర్పించారు.  సీఎం సెక్రటరీ కే.ధనుంజయ రెడ్డి, సీఎం అడిషనల్‌ సెక్రటరీ డాక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా, ఇతర సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్