Sunday, January 19, 2025
HomeTrending Newsహైదరాబాద్లో 90 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్

హైదరాబాద్లో 90 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్

అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ నగరంలో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు జిహెచ్ఎంసి కృషి చేస్తున్నది. ముఖ్యంగా రవాణా వ్యవస్థ, జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు కనీస వసతుల కల్పనకు వినూత్న ఆలోచనలకు సృజనాత్మకత జోడించి విభిన్న కోణాలతో ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు జిహెచ్ఎంసి ప్రధాన భూమిక పోషిస్తుంది.

పారిశ్రామిక అభివృద్ధితో ఉపాధి కల్పనకు పెరుగుతున్న దృష్ట్యా వాహనాల ప్రవాహం ఎక్కువగా ఉండే ఆవశ్యకతను ముందుగానే గుర్తించి జంక్షన్ల అభివృద్ధి, మెరుగుదల చేయడం సుందరీకరణ పనులు చేపట్టారు. అంతేకాకుండా సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను పటిష్టం చేశారు. ప్రజల వాతావరణ కాలుష్యం లేకుండా పర్యావరణ పరిరక్షణ కోసం అనేక రకాల వైవిధ్యమైన పేర్లతో మొక్కలను పెంచడం ద్వారా నగరంలో 147 శాతం అటవీ విస్తీర్ణం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే.

నగరం సుమారు 709 కిలో మీటర్ల నాలుగు లైన్లు అంతకంటే ఎక్కువగా వెడల్పు గల రోడ్డు కలవు. సిఆర్ ఎం పి ద్వారా రోడ్లను చేపట్టి అందరికీ మెరుగైన రవాణా వ్యవస్థను పటిష్టం చేయడం జరిగింది. అట్టి రోడ్లలో అనుకూలమైన ప్రదేశాలను గుర్తించి ప్రస్తుత బిజీ ప్రపంచంలో శారీరక మానసిక ఒత్తిడిని తగ్గింపు, శారీరక దృఢత్వం పెరిగే విధంగా నగర ప్రజలకు మెరుగైన సైక్లింగ్ వ్యవస్థను ఏర్పాటు కు జిహెచ్ఎంసి పరిధిలో పలు ప్రాంతాల్లో రాష్ట్ర మున్సిపల్ పరిపాలన ఐటీ శాఖ మంత్రి కే టి ఆర్ ఆదేశాల మేరకు సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రజల ఆసక్తి కి అనుగుణంగా

సైక్లింగ్ ట్రాక్ ను కొన్ని ప్రదేశాలలో తాత్కాలికంగా మరికొన్ని ప్రాంతాల్లో పర్మనెంట్ గా నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రతిపాదించినది.
నగరంలో ఏర్పాటు చేసిన జోన్లలో సుమారు 90 కిలోమీటర్ల పొడవు లో సైక్లింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సైక్లింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేశారు. ఎల్ బి నగర్ జోన్ లో హబ్సిగుడా క్రాస్ రోడ్డు నుండి ఉప్పల్ చౌరస్తా వరకు 3 కిలోమీటర్ల సైక్లింగ్ ట్రాక్ పర్మనెంట్ గా ఏర్పాటు చేయనున్నారు. బైరమల్ గూడ క్రాస్ రోడ్డు నుండి ఓవైసీ జంక్షన్ వరకు 4 కిలోమీటర్ల పర్మనెంట్ గా, చార్మినార్ జోన్ లో ఓవైసీ జంక్షన్ నుండి ఆరాంఘర్ వరకు శాశ్వతంగా (మోడల్ రోడ్ కారిడార్)
ఆరాంఘర్ నుండి పి డి పి జంక్షన్ వరకు 4 కిలో మీటర్లు పర్మనెంట్ గా ట్రాక్ వేయనున్నారు. ఖైరతాబాద్ జోన్ లో కే బి ఆర్ రౌండ్ పార్క్ 6 కిలో మీటర్లు టెంపరరీగా, ఓ యూ కాలనీ జంక్షన్ సెన్సార్ వ్యాలీ రోడ్ నెంబర్ 82 జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 జూబ్లీహిల్స్ రోడ్డు లిమిట్ వరకు 6 కిలోమీటర్లు, శేరిలింగంపల్లి జోన్ లో దుర్గం చెరువు కేబుల్ స్తాయిడ్ బ్రిడ్జి, ఐకియ నుండి బయో వర్సిటీ రాయదుర్గం వరకు 6 కిలో మీటర్లు, కొంత భాగం పర్మనెంట్ తాత్కాలికంగా ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. ఖాజా దుర్గ జంక్షన్ నుండి కేర్ హాస్పిటల్ వరకు, లింక్ రోడ్డు నుండి ఖాజా గూడ రోడ్డు 6 కిలో మీటర్లు రోడ్డు, కూకట్ పల్లి ఐ డి ఎల్ చెరువు (NH 65) నుండి జే ఎన్ టి యు రెయిన్ బో విస్టా నుండి ఐ డి ఎల్ చెరువు వరకు 10 కిలో మీటర్లు తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ నుండి బాలానగర్ వరకు 25 కిలో మీటర్లు తాత్కాలికంగా, సికింద్రాబాద్ జోన్ లో మెట్టుగూడ X రోడ్డు నుండి హబ్సిగూడ X రోడ్డు వరకు 4 కిలోమీటర్లు బుద్ధ భవన్ నుండి ఇందిరా గాంధీ విగ్రహం వయా నెక్లెస్ రోడ్డు 6 కిలోమీటర్ల వరకు కొంత మేర పర్మనెంట్, మరికొంత మేర సైక్లింగ్ ట్రాక్ రోడ్డు చేయనున్నారు తాత్కాలికంగా సైక్లింగ్ ట్రాక్ ఉదయం 8 గంటల వరకు సైక్లింగ్ ట్రాక్ కావలసిన ఏర్పాట్లు చేసి వాటిని తీసేసి పిదప తిరిగి అట్టి రోడ్డు ను ట్రాఫిక్ ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటారు. తద్వారా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా ఏర్పాటు చేయనున్నారు. ఇట్టి సైక్లింగ్ ట్రాక్ ను సి ఆర్ ఎం పి స్కెచెస్ లలో ఏర్పాటు చేయనున్నారు.

మౌలిక వసతులు పెద్ద పీట- మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

భవిష్యత్తు లో హైదరాబాద్ నగరం ను విశ్వనగరంగా ఎదుగుతున్నందున ప్రజలకు అన్ని వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. మౌలిక వసతులతో పాటు ప్రజల శారీరిక మానసిక ఒత్తిడిని తగ్గించడం కోసం సైక్లింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఇంతకు ముందు ప్రయోగాత్మకంగా ఆయా జోన్ పరిధిలో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయడం మూలంగా చాలా మంది ఆసక్తి కనబరచడంతో నగర వ్యాప్తంగా ప్రజల కోసం హైదరాబాద్ లో అనువైన చోట్ల 90 కిలోమీటర్ల మేర పర్మనెంట్, తాత్కాలికంగా ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలిపారు.

ఆరోగ్యం మెరుగు – డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి

సైక్లింగ్ ట్రాక్ వలన నగరానికి మంచి జరుగుతుందని డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన రోడ్ల అభివృద్ధికి విశేష కృషి చేయడం జరుగుతుందని, సైక్లింగ్ ట్రాక్ వలన ప్రజలకు ఆరోగ్యం మెరుగు పడుతుందని డిప్యూటీ మేయర్ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్