Sunday, January 19, 2025
HomeTrending Newsబంజారాహిల్స్ డిఏవి పాఠశాల గుర్తింపు రద్దు

బంజారాహిల్స్ డిఏవి పాఠశాల గుర్తింపు రద్దు

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బిఎస్ డి డిఏవి పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేలా పక్కనే ఉన్న పాఠశాలల్లో సర్ధుబాటు చేయాలని విద్యా శాఖ అధికారులకు స్పష్టం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత పూర్తిగా జిల్లా విద్యా శాఖ అధికారిదేనని మంత్రి స్పష్టీకరణ చేశారు.

డిఏవి పాఠశాలలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన భద్రతా పరమైన చర్యలను ప్రభుత్వానికి సూచించేందుకు విద్యా శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పాఠశాల విద్యా శాఖ సంచాలకులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, పోలీస్ విభాగంలో మహిళల భద్రతను పర్యవేక్షిస్తున్న డిఐజి స్థాయి అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తన నివేదికను వారం రోజుల్లోగా అందజేయాలని ఆదేసహించారు. కమిటీ నివేదిక ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంభందించి ప్రత్యేక చర్యలు చేపడతామని మంత్రి వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసే బాధ్యత ఆయా పాఠశాలల యాజమాన్యాల నుంచి హామీపత్రం తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ మంత్రి పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్